ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వద్దు….నెహ్రు నగర్ గ్రామస్తులు

పగిడ్యాల ముచ్చట్లు:

 

నెహ్రు నగర్ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వద్దు అని నెహ్రు నగర్ గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రం ఇచ్చారు. మంగళవారం నాడు నెహ్రూ నగర్ గ్రామస్తులు మండ్ల పులేంద్ర నాయుడు. రవి యాదవ్. చేపల మహమ్మద్. నాగస్వామి. అశోక్. ఆధ్వర్యంలో దాదాపుగా 50 మంది గ్రామస్తులు కలిసి పగిడ్యాల మండల ఎంపీడీవో వెంకటరమణ గారికి నెహ్రూ నగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ పద్ధతిగా పని చేయడం లేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అందువల్ల నెహ్రూ నగర్ గ్రామంలో గత 7 8 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి నియమ నిబంధనల ప్రకారం పని చేయడం లేదు. కావున నెహ్రు నగర్ గ్రామానికి కొత్త వేరే ఫీల్డ్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వెంకటరమణకు ఈ సందర్భంగా నెహ్రు నగర్ గ్రామస్తులు తెలియజేశారు. వెంకటరమణ నెహ్రూ నగర్ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గురించి సమాచారం సేకరించి ఏపీవో. మరియు పై ఉన్నత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి తగిన నిర్ణయం తీసుకొని నెహ్రూ నగర్ గ్రామ ప్రజలకు న్యాయం చేస్తామని మండల అభివృద్ధి అధికారి వెంకటరమణ ఇచ్చారు.

 

Tags: We don’t want this field assistant….villagers of Nehru Nagar

Leave A Reply

Your email address will not be published.