మంథని మట్టిలో పుట్టిన తాము ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం    

-పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని ముచ్చట్లు:

మంథని మట్టిలో పుట్టిన తాము ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు.   మంగళవారం    మంథని పట్టణంలోని తన గృహం రాజగృహాలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ ఇక్కడ అనేక బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు ఉన్న క్రమంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఈ మూత్రశాలలను వినియోగించుకోవాలన్నారు.       చేసే ప్రతి పనిలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా తమ ఆలోచనలు ఉంటాయన్నారు. ఇల్లు కట్టినా వాహనం కొన్నా నలుగురికి ఉపయోగపడాలనేది మా ఆలోచన అని ఏ పనిచేసినా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విదంగా ఆలోచన ఉంటదే తప్ప ఎలాంటి స్వార్థం ఉండదన్నారు. అందరు ప్రజా ప్రతినిధులు ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పే వాళ్లు ఉంటారని కానీ ఎవరి నడవడిక ఎలా ఉంటుందో ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. మట్టిని ప్రేమించే వారిమని, తమపై అసత్య ప్రచారం  చేసే వారికి కొంత జ్ఞానం కలుగాలే అన్నారు. తాము ఇలా ప్రజల కు సేవ చేయడం కొంత మందికి ఇష్టం ఉండదన్నారు. గొప్పగా ఆలోచన చేసి ఇల్లు కట్టినం పది మంది వస్తే కూర్చోవడానికి  సేద తీరడానికి ఉపయోగపడుదనేది మా ఆలోచన అని ఇక్కడ మాకు ఇండ్లు ఆస్తులు లేవని చెప్పే వాళ్లు ఉన్నరని, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడవన్నారు. తాము చేసే ప్రతి పనిలో ఇక్కడి ప్రజలకు అనుభవంలోకి రావాలన్నదే మా ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags: We feel lucky to have served the people themselves who were born in the Manthani soil

Natyam ad