We got married in community service

సమాజసేవ లో ప్రేమలోపడి పెళ్లిచేసుకున్నాం

-డాక్టర్లు శివ, సరళ మనోగతం

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఇద్దరం హ్గమియో డాక్టర్లుగా వేరువేరు కళాశాలలో చదువు పూర్తి చేసుకుని పుంగనూరుకు వచ్చాం. పుంగనూరు , మదనపల్లె ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలలో ఇద్దరం కలసి పాల్గొనేవారం. ఇలా తరచుగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేవారం. వృ-త్తి పరంగా, సమాజసేవలో కలుసుకోవడంతో మా మనస్సులు ఒక్కటైయ్యాయి. దీంతో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. స్నేహితులకు తెలిపాం. స్నేహితుల మద్దత్తు లభించింది. కాని సరళ తన తల్లిదండ్రులతో చెప్పాలని అడ్డుపుల్ల వేసింది. కులాలు వేరైనా , తమ భావాలు ఒక్కటే కావడంతో తల్లిదండ్రులకు చెప్పాం. వారిని ఒప్పించాం. 1990 డిసెంబర్‌ 1న మా పెళ్లి వైభవంగా జరిగింది. ఆనాటి నుంచి పుంగనూరులో సరళహ్గమియో నర్సింగ్‌హ్గమ్‌ ఏర్పాటు చేసి డాక్టర్లు శివ, సరళలు సమాజసేవ చేస్తూ పుంగనూరులో ఆదర్శవైద్యులుగా పేరుగాంచారు. డాక్టర్‌ పి.శివ జిల్లా లయన్స్క్లబ్‌ పీఆర్‌వోగా ఉంటూ , పేద ప్రజలకు అండగా నిలిచి, పలువురు మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు శివ, సరళ మాట్లాడుతూ ప్రేమలతో ఆత్మహత్యలకు పాల్పడటం చేయవద్దన్నారు. ప్రేమించలేదని హత్యలు చేయడం ప్రేమ మనుగడకు ప్రమాదమన్నారు. ప్రేమను ప్రేమగా చూస్తే అంతా విజయమేనన్నారు.

సచివాలయాల ద్వారా గ్రామాల్లో సుపరిపాలన

Tags: We got married in community service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *