Natyam ad

మేం ఎప్పటికీ ప్రజా సేవకులమే..అప్పుడు..ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాం

– చరిత్రలో నిలిచేలా సాగిన ప్రజాసంకల్ప పాదయాత్ర

– నాటి పాదయాత్ర ఫలితాలే నేటి సంక్షేమ పథకాలు

– మూడేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణలు

Post Midle

– జగన్‌కు వస్తున్న ఆదరణ చేసే ప్రతిపక్షాల కుట్రలు

– ప్రజలకు విధేయులుగా ముందుకు సాగుతాం

– బద్వేలు మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి స్పష్టీకరణ

– ఘనంగా ప్రజాసంకల్ప పాదయాత్ర ఐదేళ్ల వేడుక

బద్వేలు ముచ్చట్లు:

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా తాము ఎప్పటికీ ప్రజలకు సేవకులుగానే ఉంటామని బద్వేలు మాజీ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఫలితాలే ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా  ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పోరుమామిళ్లలో వేడుకలు నిర్వహించారు. పట్టణంలో నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తమ హోదా మాత్రమే మారిందని.. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనలో మార్పు రాలేదన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు విధేయులుగా ఉంటామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ సాగిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆనాడు ప్రజాకంఠక పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని.. ఆ తర్వాత అదే ప్రజల విశ్వాసంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారన్నారు.

 

 

పాదయాత్రలో ఏ కష్టాలైతే తెలుసుకున్నామో వాటికి పరిష్కార మార్గాలుగా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పరిపాలనలో నూతన ఒరవడిని సృష్టించినట్లు చెప్పారు. గతంలో పింఛన్లు అందుకోవాలంటే అవస్థలు పడాల్సి వచ్చేదని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకటో తేదీనే నేరుగా ఇంటి వద్దకే పింఛన్‌ అందిస్తున్నామని తెలిపారు. చదువుకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరినీ చదివించే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారని తెలిపారు. పేదవాడికి వైద్యం చేరువ కావాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి వైద్యం ఖర్చు రూ.1000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు 3225 రకాల వైద్య చికిత్సలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందన్నారు.

 

 

ప్రతిపక్ష పార్టీలకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయలేదని, కానీ ఇప్పుడు జగన్‌ చేస్తుంటే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేవలం ఇప్పుడే కాదని, పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌పై అనేక కుట్రలు జరిగాయని చెప్పారు. చివరకు జైలుకు పంపినా జగన్‌ ఎన్నడూ బాధపడలేదని, ప్రజల కోసం ముందుకే కదిలారని తెలిపారు. ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ప్రజాప్రతినిధులు, నాయకులంతా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అగ్రగామిగా చేయడానికి సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారని, ఈరోజు ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడి పథకాలపై అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. తాము ప్రజలకు విధేయులుగా ఉంటూ ప్రజా సేవకులుగానే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

 

 

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ఐదు సంవత్సరాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం పూలదండలు వేసి వారికి నివాళులర్పించడం జరిగింది అలాగే పార్టీ శ్రేణులు నియోజకవర్గ స్థాయిలో  మండల స్థాయిలో  ఐదు సంవత్సరాలు3648 కి.మి పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి  కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్ , వైస్ ఎంపీపీ సీఎం భాష  రాజశేఖర్ , వైసిపి స్టేట్ సెక్రటరీ నాగార్జున రెడ్డి రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సార్ , వైసిపి మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వార్డ్ నెంబర్ పాల్గొన్నారు.

 

Tags: We have always been public servants..then..now we are among the people

Post Midle