నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం
గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి ముచ్చట్లు:

రాజకీయ సాధికారత లేకుండా సామజిక సమానత్వం ఎన్నటికీ సాధ్యపడదని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయసభలకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రభుత్వంలో రాజకీయ సాధికారత కోసం క్యాబినెట్లో 70 శాతం పదవులు, 4 డిప్యూటీ సీఎం పదవులు, 70 శాతం జడ్పీటీసీ లాంటి స్థానిక సంస్థల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే కేటాయించామని అయన వెల్లడించారు. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు సీఎం వైయస్ జగన్ ఘనస్వాగతం పలికారు.
.సమావేశాలకు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, లీడర్ ఆఫ్ ది హౌస్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, అధికార సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ, ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు
. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. తరువాత సభ బుధవారానికి వాయిదా పడింది.
Tags;We have been providing good governance for four years
