జేసీపై చర్యలకు సిఫార్స్ చేశాం: ద్వివేది

Date:03/05/2019
అమరావతి  ముచ్చట్లు:
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన వివాదాస్పద చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలు ఇచ్చామని ఏఈ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, ఈ సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన జేసీపై చర్యలకు సిఫార్సు చేశామని ఆయన పేర్కొన్నారు. జేసీ వ్యాఖ్యలు మీడియాలో చూశామని, ఆ కేసు ప్రస్తుతం తమ పరిధిలో లేదన్నారు. రూ.50 కోట్లు ఖర్చుపెట్టారన్న వ్యాఖ్యలపై కలెక్టర్‌, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ విచారణ చేస్తున్నారని, జేసీపై చర్యలు తీసుకునే హక్కు కలెక్టర్‌కు ఉంటుందని ద్వివేది చెప్పారు.
Tags: We have recommended the actions of JC: Dwivedi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *