చిత్తూరు జిల్లా పోలీసు వారు చాట్ బాట్(9440900004), CEIR(Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్ల పై పత్రికా ప్రకటన
మూడు దశలలో సుమారు 2 కోట్ల 05 లక్షల విలువ గల 1000 ఫోన్ల రికవరీ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు.
ఈరోజు మూడవ దశలో బాగంగా సుమారు 60 లక్షల రూపాయలు విలువ గల 300 మొబైల్ ఫోన్లను చాట్ బాట్/CEIR ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్ .
మొదటి దశలో 500 ఫోన్ లు రెండో దశలో 200 ఫోన్లు మూడవ దశలో 300 ఫోన్లు మొత్తం 1000 ఫోన్ల రికవరీ.
చిత్తూరు ముచ్చట్లు:
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరి చేసి భాధితులకు అందజేశాం.
జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ.
బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు.
ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్న బాధితులు.
ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరుకు రాని వారికి ప్రత్యేకంగా కొరియర్ ద్వారా బాదితుల ఫోన్ లను నేరుగా వారి ఇంటికి చేర్చుతున్నాం.
“CHAT BOT/CEIR సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న మొబైల్ వినియోగ దారులకు మరింత సులువుగా ఉంటుంది.
మొబైల్స్ ట్రేస్ చేసిన చిత్తూరు పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ .
చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, IPS ఆదేశానుసారం ఈరోజు చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఏర్పాటు చేసి మూడవ దశలో రికవరీ చేసిన సుమారు 60 లక్షల విలువగల 300 మొబైల్ ఫోన్ లను బాధితులకు అందజేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్.సుధాకర్ .ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువ అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వర్నతాతీతం. అటువంటి మొబైల్ ఫోన్ ను ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి “చాట్ బాట్/CEIR” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను మరల పొందవచ్చునని తెలిపారు.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో మూడవ సారి 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి మొబైల్స్ ను చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ భాస్కర్, క్రైమ్ ఎస్.ఐ. ఉమా మహేశ్వర రావు, చాట్ బాట్ సిబ్బంది బాపూజీ, శ్రీనివాసన్, రఘురామన్ ఆధ్వర్యంలో మరియు టెక్నికల్ అనాలసిస్ వింగ్ ఇంచార్జ్ దేవరాజులు వారి సిబ్బంది సంయుక్తంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినారు.ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. పోయిన మొబైల్ ఫోన్లు మన రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్, మరియు మన జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి భాదితులకు అందజేసిన పోలీస్ సిబ్బంది పని తీరు హర్షనీయమని తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న భాదితులు కేవలం చిత్తూరు జిల్లా నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.ఇంకా పెండింగ్ రికవరీ లు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలో రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని తెలియజేసారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్బముగా అడిషనల్ ఎస్పీ గారు తెలియజేసారు.
మీ వివరాలు CHAT BOT కు పంపవలసిన విధానం :
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help అని పంపాలి.
తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది.
ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది.
“CHAT BOT” సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురయినా… మిస్ అయినా వెంటనే వాట్సాప్ నంబర్ 9440900004 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు.
మూడవ దశలో 300 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందజేసేందుకు కృషి చేసిన క్రైమ్ సి.ఐ. భాస్కర్, క్రైమ్ ఎస్.ఐ. ఉమా మహేశ్వర రావు మరియు వారి సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సర్టిఫికేట్ తో అభినందించారు.
Tags: We have recovered 300 phones within two months.