అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం

-తబ్లీక్ జమాత్ వివరణ

Date:01/04/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తబ్లీక్ జమాత్ కు చెందిన అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ ఇది. దాదాపు వందేళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతీ కార్యక్రమం 3 నుంచి 5 రోజులే ఉంటుంది. ఏడాది ముందే కార్యక్రమ తేదీలు ఖరారవుతాయని అన్నారు. దేశవిదేశీ యాత్రికుల సౌలభ్యం దృష్ట్యా తేదీల ఖరారు అయ్యారు. జనతా కర్ప్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశాం. రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో 22న చాలామంది ఢిల్లీలో చిక్కుకున్నారు. 22న రాత్రి 9 గంటల వరకూ జనతాకర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటికి రాలేదు. ఆ తర్వాత స్వస్ధలాలకు వెళ్తామన్నా చాలా మందికి సాధ్యం కాలేదు. జనతా కర్ఫ్యూ ఎత్తేయగానే ఢిల్లీ ప్రభుత్వం 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఎవరికి తోచిన మార్గాల్లో స్వస్ధలాలకు బయలుదేరారు.

 

 

 

23న కేంద్రం ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పొడిగించడంతో మరిన్ని సమస్యలొచ్చాయి. లాక్ డౌన్ పొడిగింపుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఢిల్లీలోనే వారిని ఉంచాం. 24న లాక్ డౌన్ నేపథ్యంలో మర్కజ్ మూసేయాలని ఢిల్లీ పోలీసులు నోటీసిచ్చారు. 24నే ప్రభుత్వం నుంచి 17 వాహనాల పాస్ లు తీసుకుని కొందరు వెళ్లిపోయారు. మిగిలిన కొందరికి ఢిల్లీ ప్రభుత్వం ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించింది. 28న ఢిల్లీ పోలీసులు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులిచ్చారు. కానీ స్ధానిక అధికారులతో తమ సంప్రదింపుల వివరాలతో సమాధానం ఇచ్చాం.

 

 

 

 

29న సోషల్ మీడియా పుకార్లతో కేజ్రివాల్ మర్కజ్ పెద్దలపై చర్యలకు ఆదేశించారు.  లాక్ డౌన్ సందర్భంగా మర్కజ్ లో చిక్కుకున్న వారిని ఇళ్లకు పంపేందుకే ప్రయత్నించాం. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఫలించకపోవడంతో మర్కజ్ లో జనం ఉండిపోయారు. కేజ్రీవాల్ కార్యాలయం వాస్తవాలను నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు.

 

 

 

ఇప్పటికైనా ప్రభుత్వం మర్కజ్ ను క్వారంటైన్ గా ఆస్పత్రిలో మార్చుకోవచ్చు. వందేళ్ల చరిత్రలో మేం ప్రతిసారీ ప్రభుత్వాలకు సహకరించాం. ఇప్పటికీ అధికారుల సూచనల మేరకు నడుచుకునేందుకు మేం సిద్ధమని ప్రకటించారు.

 

 కందులతో నిండిపోయిన యార్డులు

Tags: We have taken all precautions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *