ముంపు బాధితులను ఆదుకుంటాం

Date:09/05/2020

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్  ముంపు బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  శనివారం ఆయన జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్  సి.లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావుతో కలిసి ఉదండాపూర్ రిజర్వాయర్ లో ముంపుకు గురవుతున్న ఉదండాపూర్ , వల్లూరు గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిర్మించనున్న పునరావాస కేంద్రానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు.

 

 

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లా తో పాటు ఇతర జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని రకాల సహాయం అందిస్తున్నదని చెప్పారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నీటితో నింపిన తర్వాత  పంటలతో పాటు రొయ్యలు, చేపల పెంపకం మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడి నుండి ప్రజలు ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు  ప్రక్రియ ప్రారంభమైందని, రిజర్వాయర్ నిర్మాణం లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా 100% న్యాయం చేసేలా చూస్తామని ,అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. పునరావాస కేంద్రానికి ఎంపిక చేసిన స్థలం జాతీయ రహదారి కి దగ్గరగా ఉండటం మంచి శుభ పరిణామమని, ఆర్ అండ్ ఆర్ సెంటర్ మోడల్ టౌన్ షిప్ విశాలమైన రహదారులతో పార్కులతో సౌకర్యాలను కలుగజేసి తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రత్యేకించి రైతులకు రుణమాఫీ, రైతుబంధు  తదితర పథకాలు అమలు చేస్తున్నదన్నారు.రిజర్వాయర్ త్వరిత గతిన పూర్తి కి గ్రామాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

 

శాసనసభ్యులు  డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్లో భూములు,ఇండ్లు కోల్పోతున్న వారికి  మంచి ఆర్ అండ్ ఆర్ సైట్ ను నిర్ణయించడం జరిగిందని ,ఇందుకు సంబంధించి భూ సేకరణ పనులు కూడా మొదలు పెట్టడం జరిగిందని, భూములు కోల్పోయిన వారందరికీ తొందరలోనే చెల్లింపులు చేస్తామని తెలిపారు .ఎంపిక  చేసిన స్థలంలో చదును చేసి అందరికీ 100% ప్లాట్లు అందజేస్తామని తెలిపారు. రాళ్లు,గుట్టలు చదును చేసిన తర్వాత  నిపుణులకు అప్పగించి టెండర్ ద్వారా ప్లాట్లు రూపొందిస్తామని, కొత్త కాలనీలో పాఠశాల ,గుడి వంటివి ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే విధంగా చేస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు,ఇండ్లు కోల్పోతున్న  వారూ ఇండ్లు నిర్మించుకొనేందుకు దేవుని గుట్ట తండా, బండమీదపల్లె రైతులు  వారి పొలాలను ఇస్తున్నందున వారిని కూడా తప్పనిసరిగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

మీ ప్రాణాలు కాపాడుకోవడం మా బాధ్యత కరోనా కట్టడకి ప్రజలు సహకరించాలి..!

Tags: We help the victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *