పుంగనూరులో గడప గడపకు ప్రజలతో మమేకం

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు వెళ్లి ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ప్రజలతో మమేకమౌతున్నామని కౌన్సిలర్లు రేష్మా, అమ్ము, నటరాజ లు తెలిపారు. శనివారం గడప గడపకు కార్యక్రమాన్ని బజారువీధి, కుమ్మరవీధి, షిరిడిసాయినగర్‌, కొత్తయిండ్లు ప్రాంతాల్లో కౌన్సిలర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందని వారు అర్హులై ఉంటే తక్షణమే మంజూరు చేయిస్తామని ప్రజలకు హామి ఇచ్చారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లోను ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా ఇన్‌చార్జ్ నవీన్‌కుమార్‌రాజు, రాజేష్‌, సురేష్‌, బండకుమార్‌తో పాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: We meet people at Gadapa Gadapa in Punganur

Post Midle
Natyam ad