రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సూచా తప్పక పాటిస్తున్నాం

Date:12/09/2020

 

– మేయర్ సునిల్ రావు

కరీంనగర్ ముచ్చట్లు:

టెక్నికల్ ఇబ్బందులను ఎదుర్కొని…విజయవంతంగా నగర ప్రజలకు ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేస్తున్నామని ప్రకటించారు నగర మేయర్ వై.సునిల్ రావు. మంచి నీటి సరఫరా లో భాగంగా కరీంనగర్ లోని మానేరు డ్యాం సమీపంలో గల నగరపాలక సంస్థ మరియు మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఈ రోజు అకస్మిక తనిఖీ చేశారు. మిషన్ భగీరథ 36 ఎఎల్ డీ మరియు నగరపాలక సంస్థ 34, 14 ఎంఎల్ డీ నీటి శుద్ధీకరణ కేంద్రాలను సందర్శించారు. ఇందులో పర్యటించి… మిషన్ భగీరథ మరియు నగరపాలక సంస్థ కు సంబందించిన మోటారు పంపులు, జనరేటర్ పనితీరు, నీటిని శుద్ది చేసే విధానం, క్లోరినేషన్ ప్రక్రియ, రా వాటర్ సరఫరా అవుతున్న తీరు, ఫిల్టర్ బెడ్లలో క్లోరినేషన్ చేస్తున్న పద్దతిని నిశితంగా పరిశీలించారు. శుద్దీ చేయబడిన నీటిని స్వయంగా సేవించి… మంచి నీటి నాణ్యతను పరిక్షించారు. ఉదయం నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం జరగడంతో నూతనంగా కనెక్షన్ ఇచ్చిన 2000 కిలో వాట్స్ కెపాసిటీ గల జనరేటర్ సామర్థ్యాన్ని పరిక్షించారు. స్థానికంగా ఉన్న నిపుణులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వైపు నగరపాలక సంస్థ చెందిన నీటి శుద్ధీకరణ కేంద్రం లో 350 సామర్ష్యం గల మోటారు పంపులను… 500 కి. లో వాట్స్ సామర్ష్యం గల జనరేటర్ల పనితీరును పరిశీలించారు. నూతనంగా కొనుగోలు చేసిన 500 కి. వా సామర్థ్యం గల మరో జనరేటర్ ను పరిశీలించారు. మరో వారం రోజుల్లో కనెక్షన్ ఇవ్వాలని స్థానిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్టాండ్ బై గా ఉన్న రెండు మోటారు పంపుల రిపేరు చేయకుండ నిర్లక్ష్యం వ్యవరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మోటారు పంపులను రిపేరు చేయించాలని ఆదేశించారు.

 

 

ఈ సంధర్బంగా నగర మేయర్ వై.సునిల్ రావు మాట్లాడుతూ…. గత నెల రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రోజు నగర ప్రజలకు సురక్షిత మైన మంచి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నగరంలోని రెండు డివిజన్ల పరిదిలో అప్పుడప్పుడు టెక్నికల్ సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరిస్తూ… 45 నిమిషాల నుండి 1 గంట సమయంలో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని నీటి శుద్దీకరణ కేంద్రంలో తనిఖీ చేపట్టి… శుద్దీకరణ విధాన్ని పరిశీలించామని తెలిపారు. ఫిల్టర్ బెడ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు ఫిల్టర్ చేసి…ట్యాంకులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొన్ని డివిజన్ల పరిదిలో పైపు లైన్ సమస్యలు గాని వాల్ సమస్యల కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు.  వాటిని కూడ పరిష్కరించి… మంచి నీటిని సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.

 

నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్ఠిలో పెట్టుకొని… నీరందించడమే ప్రథమ కర్తవ్యంగా అధికారులు, సిబ్బంది తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసిఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి ఆలోచన మేరకూ… నగరపాలక సంస్థలో ప్రతి రోజు నీరందింస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ గారు మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నీటి సరఫరా పై ప్రత్యేక చొరవ చూపి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం మానేరు జలాశయంలో 23 టీఎంసీల నీరు ఉందని… ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఎప్పటికి 10 టీఎంసీల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జలాశయం నుండి ఫిల్టర్ బెడ్ కు కొత్త నీరు వచ్చినప్పపడు ప్రత్యేక శ్రద్ద వహించి… జాగ్రత్తలు పాటించి నీటిని శుద్దీకరణ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కొత్త నీరు వచ్చిన సమయంలో క్లోరినేషన్ విధానం సక్రమంగా చేసి… సురక్షిత మైన నీటిని సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. పిల్టర్లబెడ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా… మంచి నీటిని సరఫరాా చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు సరఫరాలో ఇబ్బంది కలగకుండా రెండు ఫిల్టర్ బెడ్ లను కలుపుకొని మొత్తం 3 వేల సామర్ష్యం గల జనరేటర్లను ఏర్పాటు చేశామనిి స్పష్టం చేశారు. నగర ప్రజలు కూడ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. మీ నల్లా కనెక్షన్లకు ఆన్ ఆఫ్ బటన్ లను బిగించుకొని… అవసరం లేనప్పుడు బందు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటి శుద్దీకరణ కేంద్ర ఇంచార్జ్ అజయ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

శాంతి చ‌ర్చ‌ల‌కు భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు

Tags:We must follow the instructions of the state government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *