రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి-ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ముచ్చట్లు:
రైతు సమస్యల పరిష్కారం కోసం నూతన పాలక వర్గం కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు శనివారం జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ని నియామకానికి కృషి చేసినందుకు ఎమ్మేల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేయగా
ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల జిల్లా లో అతిపెద్ద మార్కెట్ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అని, మార్కెట్ కి పండ్లు,పప్పులు, దాన్యం పెద్ద మొత్తం లో వస్తుంటాయని,4 కోట్ల తో సమీకృత మార్కెట్ రాగా అదనంగా మార్కెట్ కి 10ఎకరాల స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అని అన్నారు.చల్ గల్
మార్కెట్ లో రాష్ట్రం వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్,వెయిట్ మిషన్,గోదాం లు,పండ్ల మార్కెట్ లో ఒక లక్ష ఎస్ఎఫ్టీ తో షెడ్లు నిర్మాణం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, మార్కెట్ అభివృద్ధికి నూతన పాలక వర్గం చిత్త శుద్ది తో కృషి చేయాలని అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం నూతన పాలక వర్గం కృషి చేయాలని ఈసందర్భంగా ఎమ్మేల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మెన్ నక్కల రాధ రవీందర్ రెడ్డి,వైస్ చైర్మన్ అసిఫ్,డైరెక్టర్ లు జనగాం నరేష్,పులిషెట్టీ
శ్రీనివాస్,శారద,జై రాంసురేష్, ఆనంద్ రావు,విజయ్,మల్లారెడ్డి,దమ్మ రాజిరెడ్డి,కోలగాని లచ్చన్న,గర్వందుల గంగన్న,రాజేష్, గంగాధర్ లు ఉన్నారు.

Tags:We must work for the solution of the problems of the farmers-MLA Dr. Sanjay Kumar
