సమాజంలో జరిగే విషయాలపై అవగాహన అవసరం

We need to be aware of the things that happen in society

– న్యాయమూర్తి బాబునాయక్‌

Date:23/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

విద్యార్థులు సమాజంలో జరిగే విషయాలపై అవగాహన పెంచుకుని, జాగ్రత్తగా బంగరు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ సూచించారు. శనివారం ఎస్సీ బాలికల హాస్టల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయవాదుల సంఘ కార్యదర్శిమల్లికార్జునరెడ్డి , ఏజిపి ప్రభాకర్‌నాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అన్ని స్రమానహక్కులను అందజేసిందన్నారు. ఈ హక్కులకు భంగం కలగకుండ ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు , జీవించే హక్కు ఉందన్నారు. బాలలను కార్మికులుగా వినియోగించుకోవడం నేరమన్నారు. వారి చేత వెట్టిచాకిరి చేయించినా, ప్రేరేపించినా శిక్షార్హులన్నారు. విద్యార్థుల సమస్యలపై ఉప్యాధ్యాయులు ఎప్పటికప్పుడు గుర్తించి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. సమస్యలు తీవ్రంకాకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన సమయంలో పోలీసుల రక్షణ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెంబర్లు ప్రశాంతి, సుబ్రమణ్యం, వార్డెన్‌ లక్ష్మిదేవి , విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్షన్లతో కొల్లగొడుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు

Tags: We need to be aware of the things that happen in society

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *