– సీనియర్ సివిల్‌జడ్జి బాబునాయక్
Date:14/11/2019
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలోని ప్రతి ఒక్కరు చట్టాల పట్ల అవగాహన పెంచుకుని, సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని పుంగనూరు సీనియర్ సివిల్‌జడ్జి బాబునాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్‌జడ్జి రమణారెడ్డి హాజరైయ్యారు. గురువారం రామసముద్రం మండలం కెసి.పల్లె పాఠశాలలో బాలల దినోత్సవాన్ని , న్యాయవిజ్ఞాన సదస్సును న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శి పులిరామకృష్ణారెడ్డి, ఆనందకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్భంగా సీనియర్ సివిల్‌జడ్జి బాబునాయక్ మాట్లాడుతూ గిరిజన బాలికలకు చట్టాలపట్ల అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులపై ఎలాంటి వేదింపులు జరిగినా తక్షణమే కఠిన చర్యలు తీసుకునేందుకు అనుకూలమైన చట్టాలను రూపొందించారన్నారు. విద్యార్థులకు భోజనము, వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏజిపి ప్రభాకర్‌నాయుడు, తహసీల్దార్ రవి, ఎస్ఐ పరశురాముడు, న్యాయవాదులు శ్రీరాములురెడ్డి, షమివుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
Tags: We need to raise awareness of the laws