రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలను అరికట్టాలి… సిపిఎం  

తుగ్గలి ముచ్చట్లు:

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను వెంటనే అరికట్టాలని సీపీఎం అనుబంధ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.బుధవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక సచివాలయం వద్ద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసనను వ్యక్తం చేశారు.నిత్యావసర ధరలను రోజురోజుకు పెంచడం ద్వారా చిన్న మరియు మధ్య తరగతి కుటుంబాలు,చిరు వ్యాపారస్తులు,చిరుద్యోగులు,రైతులు మరియు కార్మికులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని వారు తెలియజేశారు.ప్రజలపై ఆస్తి పన్ను,ఇంటి పన్ను మరియు చెత్త పన్ను అంటే రకరకాల పన్నులు వేయడానికి ప్రభుత్వం పూనుకుంటుందని వారు తెలియజేశారు. పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించి, నిత్యవసర ధరలను కూడా అదుపు చేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్రం రైతులకు నష్టం చేసే చట్టాలను విరమించుకుని,చిరు ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఇచ్చి,ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పన్నులను రద్దు చేసి, వ్యవసాయ కార్మికులను ఉపాధి పథకంలో విలీనం చేసి,రెండు వందల పనిదినాలను పెంచి, రోజువారి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తుగ్గలి గ్రామ సచివాలయం నందు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పులిశేఖర్ కు సిపిఎం అనుబంధ రైతు సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీరాములు,రంగరాజు, రంగస్వామి,కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:We need to stop the rising prices of essentials …
CPM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *