చట్టాలను అవగాహన చేసుకోవాలి

We need to understand the laws

We need to understand the laws

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

Date:19/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చట్టం, న్యాయం పట్ల అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ కోరారు. శనివారం మండలంలోని పట్రపల్లెలో న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పులిరామకృష్ణారెడ్డి, కెవి.ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి బాబునాయక్‌ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రజలకు సమస్యలను పరిష్కరించుకోవడంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే విధంగా చట్టాలు, న్యాయాలు గురించి పూర్తి పరిజ్ఞానం చేసుకోవాలన్నారు. దీని ద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు వీలుందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కోర్టుల్లో లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు పంతాలకు, పట్టింపులకు పోకుండ కేసులను సత్వరం పరిష్కరించుకుని సుఖవంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లోక్‌అదాలత్‌ మెంబర్‌ సుబ్రమణ్యంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు సమ్మర్‌స్టోరేజ్‌కు త్వరలో నీరు

Tags: We need to understand the laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *