జీవవైవిధ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృషి చేయాలి : సిఎస్ దినేష్ కుమార్

Mahatma Gandhi's 150th birthday celebrations: CS

Mahatma Gandhi's 150th birthday celebrations: CS

Date:25/09/2018

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని మరింత పెపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ బయెడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.

రాష్ట్రంలో జీవవైవిధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వైల్డ్ లైఫ్) మరియు మెంబర్ సెక్రటరీ ఎపి బయోడైవర్సిటీ సొసైటీ డి.నళినీ మెహన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ

జాతీయ పార్కులు,వణ్యమృగ సంరక్షణ కేంద్రాల్లో జీవ వైవిధ్యాన్ని పెద్దఎత్తున పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నది ఈసొసైటీ ముఖ్య లక్ష్యమని అన్నారు.అందుకునుగుణంగా వణ్యమృగాల సంరక్షణకు,అటవీ పర్యావరణాలను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇందుకుగాను వివిధ సంస్థలు,ధాతలు,స్వచ్ఛంధ సంస్ధలు తదితరుల భాగస్వామ్యం,తోడ్పాటుతో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.2017-18 ఏడాదిలో 9కోట్ల రూ.లతోను,2018-19లో 14కోట్ల 50లక్షల రూ.లతో జీవవైవిధ్య పరిరిక్షణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతే జీవవైవిధ్యం ప్రకృతిచ్చిన వరమని దానిని అన్ని విధాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కావున జీవ వైవిధ్యాన్ని మరింత పొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పచ్చని చెట్లు,అడవులు,పండ్లు,పువ్వులు,ప్రకృతి సిద్ధమైన జీవరాసులు వంటి వనరులన్నీ మానవ మనుగడకు ఆధారమని వాటిని పూర్తిగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సిఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.జీవవైవిధ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలకుగాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం నిధులను పెద్దఎత్తున వినియోగించుకోవాలని చెప్పారు.

పులులు తదితర వన్యమృగాల గమనాన్ని ఎప్పటికప్పుడు తెల్సుకునేందుకు వీలుగా రక్షిత అటవీ ప్రాంతాల్లో  ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేసి వాటికి కెమరాలను అనుసంధానం చేయడం ద్వారా ట్రాకింగ్ చేయాలని అన్నారు.

ఇంకా ఈసమావేశంలో జీవవైవిధ్య పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము,పిసిసిఎఫ్ డా.మహ్మద్ ఇలియాస్ రిజ్వి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయెడైవర్సిటీ బోర్డు అధ్యక్షులు మిశ్రా,వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ హైదరాబాదు అధ్యక్షులు  అనిల్ కుమార్,ఇతర అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

26న కాంగ్రెస్‌లోకి కొండా దంపతులు ?

Tags:We need to work to further enhance biodiversity: CS Dinesh Kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *