లక్ష్యాలను అధిగమించెందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం

Date:23/09/2020

 

అనుకున్న సమయానికి అన్ని పూర్తి చేస్తాం

-జిల్లా కలెక్టర్ కె.శశాంక:

కరీంనగర్ ముచ్చట్లు

గ్రామ, పట్టణ స్తాయిలో ఆమోదం లేని లేఅవుట్స్, ప్లాట్లను గుర్తించి వంద శాతం ఎల్.ఆర్.ఎస్. సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సి.ఎం.ఆర్., ఎల్.ఆర్.ఎస్., పల్లె ప్రకృతి వనాలు, స్ట్రీట్ వెండర్స్ బుణాలు, రైతు వేదికలు, పట్టణ ప్రగతిలో నర్సరీలు, అర్బన్ ట్రీ, పార్కులు, పల్లె ప్రకృతి కార్యక్రమాలపై జిల్లాల వారిగా సమీక్షించారు. సమీక్షా కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిప్ల సెక్రటరీ అర్వింద్ కుమార్, రాష్ట్ర పంచాయితీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర మున్సిపల అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు డాక్టర్ ఎన్. సత్యనారాయన, సెక్రటరీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన సమీక్షిస్తూ, సి.ఎం.ఆర్. (కస్టం మిల్లింగ్ రైస్) ప్రతి రోజు రైస్ మిల్లుల నుండి ఎఫ్.సి.ఐ.కి పంపిస్తున్న ధానయ్మ్ వివరాలను, బ్యాలెన్స్ వివరాలను తెలియచేయాలని, సి.ఎం.ఆర్. లక్ష్యాన్ని వచ్చే 7 రోజుల్లో పూర్తి చెయాలని, ఎలాంటి పెండింగ్ ఉండరాదని తెలిపారు. రైతు వేదికల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పేమెంట్స్ వెంట వెంట చెల్లించాలని, అన్ని హంగులతో రైతు వేదిక భవనాలు పూర్తి చేయాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. పట్టణ పరిథిలో వీధి వ్యాపారులకు బుణ మంజూరిలో లభ్దిదారులను గుర్తించాలని, ప్రభుత్వం కల్పించే బుణ సహాయాన్ని అందచేయాలని, 5 శాతం బుణ మంజూరీని ఖచ్చితంగా సాధించాలని, ఆన్ లైన్ అప్ లోడ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకొవాలని తెలిపారు. గ్రామ, పట్టణ స్థాయిలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్.ఆర్.ఎస్.) ప్రజలందరికి తెలియచేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కలిగించాలని, ఆమోదం లేని లేఅవుట్స్, ప్లాట్ లను రెగ్యులర్ చేసుకునేలా క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు గైకొనాలని, పట్టన స్థాయిలో మున్సిపాలిటికి ఒక ప్రత్యేక అధికారి నియామకం తో ఎల్.ఆర్.ఎస్.

 

 

పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పట్టణ ప్రగతి లో భాగంగా అర్భన్ పార్కులకు స్థలం గుర్తింపు వివరాలను అప్ లోడ్ చేయాలని, ఈనెల 30 లోగా నర్సరీల ఏర్పాటుకు స్థలాల ఎంపిక, నిర్వహణ పై పూర్తి స్థాయి చర్యలు తీసుకొవాలని తెలిపారు. పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయితీ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ పొందినందున మొక్కల సంరక్షణ , పారిశుద్ద్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా, డివిజన్, మండల  పంచాయితీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతో గ్రామ పంచాయితీ సర్పంచ్, సెక్రటరీల భాగస్వామ్యంతో పల్లెప్రగతి కార్యక్రమాలను అమలు జరిగేలా చర్యలు తీసుకొవాలని తెలిపారు. 2021 సంవత్సరంలో మొక్కలు నాటెందుకు కావలసిన నర్సరీ మొక్కల వివరాలపై యాక్షన్ వివరాలను సిద్ధం చేయాలని, హౌజ్ హోల్డ్, కమ్యూనిటీ, రోడ్ సైడ్ ప్లాంటేషన్ లకు కావలసిన మొక్కల వివరాలను సిద్ధం చేయాలని తెలిపారు. హౌజ్ హోల్డ్ ప్లాంటేషన్ లో భాగంగా ప్రతి ఇంటికి అందచేసిన 6 మొక్కల వివరాలను సమర్పించాలని తెలిపారు.

 

ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల అమలుతీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపాలని, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ సి.ఎం.ఆర్., ఎల్.ఆర్.ఎస్., పల్లె ప్రకృతి వనాలు, వీధీ వ్యాపారులకు బుణాలు, రైతు వేదికల నిర్మాణాలు, పట్టణ, పల్లె ప్రగతి నర్సరీలు, ట్రీ పార్కుల నిర్మాణాలు పూర్తి చేయుటకు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెలుతున్నామని, అలాగే ఎల్.ఆర్.ఎస్. పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించుట జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ వీడియో కాన్పరెన్సులో   మున్సిపల్ కమీషనర్ వల్లూతి క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, నర్సింహ రెడ్డి, అదనపు పోలిస్ కమిషనర్ (ట్రైనీ), జిల్లా రెవెన్యూ అధికారి వెంకట మాధవ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పంచాయితీ అధికారు బుచ్చయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి 

Tags:We prepare plans to surpass the goals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *