తక్షణ సహాయం అందిస్తున్నాం

Date:20/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు

ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన ఇండ్ల లకు వెళ్లి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తరుపున తక్షణ సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసామని మంత్రి మల్లారెడ్డి అన్నారు.  వరదల ముంపు ప్రజలకు 550 కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు  ప్రజలు,  నేతల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.  వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దు.  ప్రజలకు ముఖ్యమంత్రి ఎప్పుడూ అండగా ఉన్నారు.  వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని అయన అన్నారు.
రాత్రి సమయంలో నిద్రపోకుండా నాయకులు కష్టపడుతున్నారు.  ఒకటి తరువాత ఒకటి చేరువులన్ని తెగిపోయి-కాలనిలన్ని నీట మునిగాయి.  ప్రజలకు అండగా ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలని అన్నారు. ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి నవీన్ రావు గారు, ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు గారు, స్థానిక కార్పొరేటర్ నర్సింహ యాదవ్,జీ హెచ్ ఎం సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.శ్వర రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

డ్రగ్ డీలర్ ఆరెస్టు

Tags:We provide immediate assistance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *