We serve 512 people in ministries

సచివాలయాలలో ప్రజలకు 512 సేవలు అందిస్తాం

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:01/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు అన్ని సచివాలయాలలోను ప్రజలకు 512 సేవలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం పట్టణంలోని కొత్తయిండ్లలో 27 శాఖలకు చెందిన 512 సేవలకు సంబంధించి ప్రజలకు తొలి ధృవీకరణ పత్రాన్ని ఎంపీ రెడ్డెప్ప చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకునేందుకు వార్డు సచివాలయాలలో సంప్రదించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజల అర్జీలను పరిశీలించి, సంబధిత ధృవీకరణ పత్రాలు, పాసుపుస్తకాలు, నీటి కొళాయి కనెక్షన్లు , తదితర సేవలను ఆయా శాఖలకు పంపి పరిష్కరిస్తారన్నారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సచివాలయాలలో ఉద్యోగులు క్రమశిక్షణతో , ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలన్నారు. ప్రజలను చిరునవ్వుతో పలుకరించాలని , ఎలాంటి నిర్లక్ష్యము ప్రదర్శించవద్దని సూచించారు. ప్రజలు ఆయా వార్డుల్లో సేవలు పొందాలని , మున్సిపల్‌ కార్యాలయానికి రావాల్సిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేసిన ఎంపీ రెడ్డెప్ప

Tags: We serve 512 people in ministries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *