ప్రజా కంఠక ప్రభుత్వాల్ని సాగనంపాల్సిందే -కమ్యూనిస్ట్ లే ఈ దేశానికి రక్ష

‌‌__సిపీఐ

 

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల సందర్భంగా పలు బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు ప్రజా కంఠక పాలన కొనసాగిస్తున్నాయని సత్వరం ఆ పార్టీలను సాగనింపాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, సిపిఐ జిల్లా సీనియర్ నాయకుడు టి. జనార్ధన్ లు పిలుపిచ్చారు. నిస్వార్థంగా సామాన్య ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులు మాత్రమే ఈ దేశానికి రక్ష అని వారు పేర్కొన్నారు .ఆదివారం పుంగనూరులో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ పట్టణ కార్యదర్శి గండికోట చలపతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వక్తలుగా పాల్గొన్న నాగరాజు, జనార్దన్ లు మాట్లాడుతూ దేశంలో ప్రజల సమస్యలకు గాలికి వదిలేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలకు ప్రభుత్వాలు తిలోదకాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ₹8లక్షల కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తిపై ₹1.5 లక్షల భారం వేస్తే, కేంద్ర ప్రభుత్వం తక్కువ లేదని దేశం ప్రజలపై₹ 80 లక్షల కోట్ల అప్పులు మోత మోయిస్తున్నారని తెలిపారు. రైతులకు వ్యవసాయం, గిట్టుబాటు ధరలు లేకుండా చేశారని , నేడు,పంట విరామం ప్రకటించే దుస్థితికి తెచ్చారని, కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద చర్యలతో ప్రజల్ని విడదీయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ,నిరుద్యోగ సమస్యను పెంచి పోషించడం, ధరలు చుక్కలు అంటించడం, ఫాసిస్ట్ పద్ధతులను అవలంబించడం తో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. రాష్ట్రంలో సైతం జగన్ ప్రభుత్వం బిజెపితో అంట కాగుతూ ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసే దుస్థితికి వచ్చిందన్నారు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీని మూసివేశారని ,విజయ డైరీ ని పునః ప్రారంభించడంలో వైఫల్యం చెందారని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక కోట్లాది రూపాయలు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా సమస్యల పట్ల చర్చించి పోరాట కార్యక్రమం చేపట్టడానికి చిత్తూరులో జరిగే జిల్లా మహా సభలు, పుంగనూరులో ఆగస్టు 16న జరిగే పట్టణ మహాసభ వేదిక కాబోతున్నాయని పేర్కొన్నారు.మహాసభల జయప్రదం చేయడానికి ప్రతి పార్టీ సభ్యుడు, కార్యకర్త శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

సీనియర్ కమ్యూనిస్టు నేత జి.వి. చలపతికి సన్మానం….

60 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ పార్టీ ఉద్యమానికి, పేద ప్రజల సమస్యల పట్ల త్యాగనిరతి ప్రదర్శించి, పార్టీకి పుంగనూరు ప్రాంత ప్రజలకు సేవలు అందించిన పార్టీ సీనియర్ నేత గండికోట చలపతికి శాలువా కప్పి సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు.ఈ సమావేశంలో సిపిఐ సహాయ కార్యదర్శులు రామ్మూర్తి ,శ్రీరాములు, మున్నా, నాగయ్య ,సూరి ,శంకరయ్య ,మంజు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We should not support the public singing governments – communists are the salvation of this country

Leave A Reply

Your email address will not be published.