We should respond the same way

ఆత్యాచారాలపై ఒకే విధంగా స్పందించాలి

Date:05/12/2019

వరంగల్ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా మహిళలపై  అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న  నేపధ్యంలో సమాజ స్పందన, పార్టీలు, ప్రభుత్వాలు, ఒకే విధంగా ఖండించె విధంగా ఉండాలని ఎమ్మార్పిఎస్ అధినేత మంద కృష్ణా మాదిగ అన్నారు.
గురువారం హన్మకొండ హోటల్  హరిత కాకతీయ లో అయ మీడియాతో మాట్లాడారు. నేరం ఢిల్లీలో జరిగితే  ఒక విధం  ఆదే గల్లీలో జరిగితే ఒక విధం. 🏼హైదరాబాద్ లో ఒక విధం  గా ఉండడం, అగ్రవర్ణ కులాలల్లో అత్యాచారాలు హత్యలు, జరిగితే ఒక విధం, అదే దళిత కులలల్లో ఒక విధమని అయన అన్నారు. హైదరాబాద్ లో దిశ  కుటుంబాన్ని పరామర్శించి ఖండించాను. వరంగల్ లో జరిగిన అత్యాచారం, హత్య,ను ఖండించాను. 🏼ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులో ప్రభుత్వాలు, ఒకే విదంగా స్పందించారు. మంచిర్యాల జిల్లాలో అత్యాచారం  చేసి హత్య చేశారు.మంచిర్యాల లో జరిగిన  సంఘటకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అయన ప్రశ్నించారు. ఢిల్లీలో నిర్భయ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 4నెల్లలో అమలు జరిగింది.

 

 

 

 

 

 

 

 

మంచిర్యాల లో దళిత యువతి పై జరిగిన 22సెప్టెంబర్ 2015 లో జరిగింది. ఇప్పటి వరకు విచారణ చేయడంలేదు. ఢిల్లీకి న్యాయం గల్లికో న్యాయమా అని అయన అన్నారు. హైదరాబాద్ లో దిశ  సామూహిక అత్యాచారం హత్య ను అందరూ ఖండించారు. గత నెల 24వ తేదీ కొమురం బిం జిల్లాలో ఒక బుడగ జంగల మహిళపై  అత్యాచారం జరిపి హత్య చేసారు. దానిపై ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని అయన ప్రశ్నించారు. ఆ అత్యాచారం హత్య జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి  పెద్దఎత్తున ఆందోళన చేసాము. ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఉండవా.. నల్గొండ జిల్లా హజీపూర్ ఘటన రాష్ట్రంలో సంచలనం. నిందితుడు 🏼శ్రీనివాస్ రెడ్డి నలుగురు  మహిళలను  అత్యాచారం, హత్య చేస్తే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్  ఏర్పాటు ఎందుకు చేయలేదు.. ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని అయన అన్నారు. హజీపూర్ ఘటనపై స్పందించని నాయకులు,  హైదరాబాద్ లో దిశ పై జరిగిన అత్యాచారం హత్యపై స్పందించే అర్హత లేదని అయన అన్నారు.

 

కెమికల్ పేలి కార్మికుడికి తీవ్రగాయాలు

 

Tags:We should respond the same way

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *