పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి

We should work to win the parliamentary candidates
Date:01/04/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రేటర్ పరిధిలో పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం అయన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం పైన ఈసమావేశంలో విస్తృతంగా చర్చించారు. కేటీఆర్ మాట్లాడుతూ అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. నగరంలో రోడ్ షో ల విజయవంతానికి కృషిచేయాలి. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలి. నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించండని అన్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కృషి చేయాల్సి ఉంటుందని వారికి సూచించారు. తాము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీలతో కంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సాధించాలని సూచించారు. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ నగరవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీకి  ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని పార్లమెంట్ ఎన్నికల్లోనూ దీనిని స్ఫూర్తిగా తీసుకుని శాసనసభ ఎన్నికలకు మించి ఓట్లను సాధించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కేవలం వారి వద్దకు వెళ్ళి తెలంగాణ రాష్ట సమితికి ఓటు వేయాలని అడిగితే సరిపోతుందని ఇందుకోసం ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని గ్రేటర్ పరిధి లో ఉన్నటువంటి చేవెల్ల, సికింద్రాబాద్ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించేలా కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు.
చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో అభ్యర్థులు యువకులు కావడం పార్టీకి ఖచ్చితంగా కలిసొస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు స్థానిక ఎమ్మెల్యేలతో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారి వారి డివిసన్ల లో సాధించే మెజార్టీ లను కార్పొరేటర్ల పనితీరుకు, ప్రజాదరణకు సూచకంగా భావిస్తా అని తెలిపారు. రేపటిలోగా తమ పరిధి లో ఉన్నటువంటి బూత్ కమిటీలతో పాటు ఇంచార్జిలను మరియు పార్టీ ప్రధాన కార్యకర్తలకు సంబంధించిన జాబితాను అందించాలని కోరారు.  విస్తృతంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని కోరారు. తమ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, అపార్ట్మెంట్ కమిటీలను కలిసి ప్రచారం నిర్వహించాలన్నారు.
 ఈ రోజు నుంచి జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టనున్న రోడ్ షోల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రచారానికి సంబంధించి మేయర్ బొంతు రామ్మోహన్ గారి తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్పొరేటర్ లతో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,  మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయోద్దీన్,పార్టీ  కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్, మరియు సీనియర్  నాయకులు నవీన్ రావు, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.
Tags; We should work to win the parliamentary candidates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *