నష్ట పోయిన రైతులకు అండగా ఉంటాం

తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ
వరద నీటి ప్రవాహం పై ఎప్పటికప్పుడు నివేదికలు సేకరిస్తున్నాం
జరిగిన నష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి  దృష్టికి తీసుకుని వెళ్తా
బాలనాగిరెడ్డి

మంత్రాలయం ముచ్చట్లు:

తుంగభద్ర వరద నీటి ప్రవాహం తో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు /మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని స్వగృహం నుంచి మీడియాతో  మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడమేమనగా కర్ణాటక రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు ప్రతి రోజూ దాదాపు లక్ష యాభై వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి వరద నీరు వచ్చి సుంకేశ్వరి రిజర్వాయర్ అక్కడి  నుంచి ఎప్పటికప్పుడు నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కు విడుదల చేసే విధంగా  జిల్లా కలెక్టరు కోటేశ్వరరావు సుంకేసుల రిజర్వాయర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న వాటర్ స్కీం, పంట పొలాలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నీటి పంపింగ్ మోటారు లు, పంట నీట మునిగి నష్ట పోయిన రైతుల వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

 

 

 

జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందజేస్తు నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. అంతే కాకుండా వరద నీటి ప్రవాహం పై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం తో పాటు ఆదోని ఆర్డీఓ రామకృష్ణ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖ వారు నది తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశిల్ గారి నేతృత్వంలో పగలు, రాత్రి తేడా లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరుతున్నా. వరద నీటి ప్రవాహం పై ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపారు. జిల్లాలో వరద నీటి ప్రవాహం లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జరిగిన నష్టాన్నికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అందజేస్తానని వై. బాలనాగిరెడ్డి  సూచించారు.

 

Tags: We stand by the farmers who have lost

Leave A Reply

Your email address will not be published.