అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

Date:17/10/2019

కర్నూలు ముచ్చట్లు:

పోలీసు అమరవీరుల వారోత్సవాల సంధర్బంగా కర్నూలు జిల్లా పోలీసు,  స్పోర్ట్స్ అథారిటి అసోషియన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కర్నూలు నగరంలో మారాథాన్ పరుగు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా కర్నూలు ఎమ్మేల్యే   హాఫిజ్ ఖాన్,  కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  హజరై  మారాథాన్ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, సిబ్బంది, యువకులు అందరూ కలిసి పరుగు లో పాల్గొన్నారు.   ఈ మరాథాన్ పరుగు జిల్లా పోలీసు కార్యాలయం దగ్గర గల కొండారెడ్డి బురుజు నుండి ప్రారంభమై పాత కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్ , రాజ్ విహార్,  మౌర్యఇన్ ,  స్టేట్ బ్యాంక్, చిల్డ్రన్స్ పార్కు లమీదుగా తిరిగి కొండారెడ్డి బురుజు  జిల్లా పోలీసు కార్యాలయం వరకు సాగింది.  అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మేల్యే గారు , ఎస్పీ   మాట్లాడారు.  కర్నూలు శాసన సభ్యులు  హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ   మన దేశ సరిహధ్దు ప్రాంతంలో మరియు  రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూ రేయింబవళ్ళు ఉండే కేంద్ర బలగాలు, పోలీసుల త్యాగాలను మరవలేమన్నారు. సమాజం ప్రశాంతంగా ఉందంటే పోలీసుల బలిదానం వల్లనే అని అమరవీరుల త్యాగాలను ఎప్పటికి మరువలేమన్నారు. ఈ వారోత్సవాల్లో వారి త్యాగాలను గుర్తు చేసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలకు రుణపడి ఉంటామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు, పిల్లలకు గుర్తింపునిస్తై వారికి ధైర్యం వస్తుందన్నారు.

 

 

 

 

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఈ మారాథాన్ పరుగును నిర్వహించామన్నారు. ఓపెన్ హౌస్ జిల్లా లోని అన్ని పోలీసుస్టేషన్ లలో నిర్వహిస్తున్నారన్నారు.  నంద్యాల, ఆళ్ళగడ్డ, కర్నూలు, డోన్ సబ్ డివిజన్ లలో రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రక్తదాన శిబిరాలలో 1500 మంది దాకా పోలీసులు, ప్రజలు,యువకులు స్వచ్చంధంగా రక్తదానం చేసారన్నారు. సేకరించిన బ్లడ్ ప్యాకెట్స్ ను గవర్నమెంట్ హాస్పిటల్ వారికి అందజేశామన్నారు.

వినాయకునికి శంకష్టచతుర్ధశి పూజలు

Tags: We support the families of martyrs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *