ప్రణయ్ కుటుంబానికి అండగా వుంటాం. -ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్

We will be back to the Pranayam family

We will be back to the Pranayam family

మిర్యాలగూడ ముచ్చట్లు :
శుక్రవారం జరిగిన ప్రణయ్ హత్య ఘటనలో బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ అన్ని విధాలా ఆదుకొంటుంది. కుల పిశాచాలను  కఠినాతికఠినంగా శిక్షించి ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని అయన పరామర్శించారు.
ఇది కుల దురహంకారానికి పరాకాష్టగా అయన అభివర్ణించారు. దేశంలోనే పెను సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటన తమ హృదయం ను తీవ్రంగా కలచివేసిందని, సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఇటువంటి పాశవిక చర్యలకు పాల్పడం అనాగరికమని, కుల పైశాచికత్వనికి పరాకాష్టని, అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణలోనూ ఇటువంటి పాశవిక చర్యలను అందరూ ఖండించాలని చైర్మన్ పిలుపునిచ్చారు.
నిందితులు ఎంతటివారైనా కఠినాతి కఠినంగా శిక్షించి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అయన పోలీస్ వారికీ సూచించారు. తరువాత  షాక్  కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హతుని భార్య అమృతను  పరామర్శించిన చైర్మన్, కమిషన్ తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ సహా స్థానిక శాసనసభ్యుడు  భాస్కర రావు, కమిషన్ సభ్యులు  బొయిళ్ల విద్యాసాగర్,  యం రాంబల్ నాయక్,  చిల్కమర్రి నరసింహ్మ, జిల్లా ఎస్పీ  రంగనాథ్  పాల్గొన్నారు.
Tags:We will be back to the Pranayam family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *