పార్టీ వ్యతిరేక చర్యలపై కఠినంగా వుంటాం
విజయవాడ ముచ్చట్లు:
మైలవరం నియోజకవర్గం లో వసంత కృష్ణ ప్రసాదే ఎమ్మెల్యే. భవిష్యత్తులో కూడా ఆయనే పార్టీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టే. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నారు… ఆయన అక్కడ కొనసాగుతారు. వారిద్దరి మధ్య అనవసర విభేదాలు సృష్టిస్తే ఉరుకొమని అన్నారు. అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు కూడా వెనుకాడం. అందరూ కలిసి మెలిసి పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. అనవసర వివాదాలకు దారితీసే చర్యలు ఉపసంహరించాలని అయన సూచించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: We will be tough on anti-party activities