Natyam ad

పాత పెన్షన్ విధానాన్ని తిరిగి సాధించి తీరుతాం”

పుంగనూరు ముచ్చట్లు:

ప్రాణత్యాగం చేసైనా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి సాధించి తీరుతాం”
నేడు GPS కు వ్యతిరేకంగా పుంగనూరు MRC దగ్గర UTF సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా UTF నాయకుడు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం CPS ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, శాసనసభలో GPS ను నిన్నటి రోజున ఆమోదించడం బాధకరమని,ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసారని, పాత పెన్షన్ విధానాన్ని (OPS) తిరిగి సాధించేవరకూ, మా పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుని వెళతామని,మేము దాచుకున్న మాడబ్బును మా అవసరాలకు లేకుండా ప్రభుత్వం వాడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని తమ నిరసనను తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో UTF నాయకులు శంకర్ రెడ్డి,సుబ్రమణ్యం రెడ్డి, ఆంజప్ప, సురేంద్ర రెడ్డి,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:We will bring back the old pension system.”

Post Midle