పుంగనూరులో జగనన్నకాలనీలలో అర్హులందరికి ఇండ్లు నిర్మిస్తాం- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా నిర్మిస్తున్న జగన్నకాలనీలలో అర్హులైన లబ్ధిదారులందరికి పక్కాఇండ్లు నిర్మించి ఇస్తామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటిలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పంపిణీ చేశారు. అలాగే రహమత్‌నగర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు జులైన 1, 3, 4 తేదీలలో మూడు రోజుల పాటు శుభముహుర్తాలను నిర్ణయించి, జగనన్నకాలనీలలో పునాదుల మేళా నిర్వహిస్తున్నామని , లబ్ధిదారులందరు పనులు ప్రారంభిస్తారన్నారు. టిట్కో ద్వారా 1523 మందికి ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం మరో 1600 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. వీటిలో ఇండ్ల పనులు ప్రారంభిస్తామన్నారు. కాలనీలకు అవసరమైన లైట్లు, మంచినీరు, మెటిరియల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లభ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: We will build houses for all the deserving people in Jagannath Colony in Punganur – Commissioner KL Verma

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *