పుంగనూరులోని నక్కబండలో నకిలీపట్టాలు రద్దు చేస్తాం-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని నక్కబండ ప్రాంతంలో నకిలీ పట్టాలను రద్దు చేసి, చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణంతో కలసి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా కొంత మంది క్రిందిస్థాయి ఉద్యోగులు నకిలీ పట్టాలను ప్రోత్సహిస్తూ , అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సమగ్రమైన దర్యాప్తు చేసి, ఆప్రాంతంలో 224 మందికి పట్టాలు మంజూరు చేశామన్నారు. నకిలీ పట్టాదారులపై పోలీస్‌ కేసులు పెడుతామన్నారు. అలాగే ఒకొక్కరు 10 పట్టాలు పొందారని, వాటిపై విచారణ జరుపుతున్నామన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడే క్రిందిస్థాయి ఉద్యోగులు పద్దతులు మార్చుకోవాలని లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: We will cancel duplicates at Nakkabanda in Punganur-Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *