హైకోర్టు తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తాం..!!

_ప్రజాతీర్పును అడ్డుకుని టీడీపీ సంబరపడటం సిగ్గుచేటు

_ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌వైపే జనం

_సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

 

అమరావతి ముచ్చట్లు:

 

పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు దురదృష్టకరం, అన్యాయమని చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం అన్నారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తుందని చెప్పారు… శనివారం తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ ఘటనలో మృతి చెందిన వరదయ్యపాలెం మండలం తొండూరు సొసైటీకి చెందిన చెందిన ఇ. సుబ్రహ్మణ్యం కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును వరదయ్యపాలెం మండల పరిధిలోని వెన్నెలకంటి రాఘవయ్య గిరిజన కాలని వద్ద మృతుడి భార్య చేంగమ్మ కి ఎమ్మెల్యే అందించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిమూలం….ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను దూరం చేయవచ్చని ,ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కర్ఫ్యూ విధించడం జరుగుతుందని, సడలింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, పోలీసులకు సహకరించాలని, ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాలని సూచించారు. . సమస్య ఉన్నప్పుడు సమీపంలోని వైద్య సిబ్బందికి తెలియజేసి వైద్యాధికారుల సలహా మేరకు నడుచుకుంటే కరోనాను తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు రోజుల వ్యవధిలోనే 10 లక్షల రూపాయలు అందించి భరోసా ఇవ్వడం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేశామని, దీనివల్ల ప్రతి ఒక్కరికీ సమస్య పరిష్కారం కావాలనేది సీఎం జగన్‌ ఆశయమన్నారు. కరోనా మేనేజ్‌మెంట్‌ పకడ్బందీగా జరుగుతోందన్నారు. బాధితులను తరలించడానికి 108 వాహనాలను వాడుకుంటున్నామన్నారు.

 

 

 

 

అదేవిధంగారాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ఫైనల్‌ కాదని ఆదిమూలం అన్నారు. గతంలో సింగిల్‌ బెంచ్‌ స్టే ఇస్తే డివిజన్‌ బెంచ్‌ ఎన్నికలు జరిపించిన విషయం ప్రజలు చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఒక బెంచ్‌కు మరో బెంచ్‌కు మధ్య అభిప్రాయాలు మారుతూ ఉంటాయని చెప్పారు. ఈ విషయం ఫైనల్‌ అయ్యే వరకు టీడీపీ, జనసేనలు తమ తమ పద్ధతుల్లో వాదనలు చేస్తూనే ఉంటారన్నారు. ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తుందని చెప్పారు. చిల్లర రాజకీయాలతో ప్రజాతీర్పును అడ్డుకుని టీడీపీ సంబరపడటం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ కుసంస్కారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో నేరుగా వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే చంద్రబాబు దొంగదెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ శక్తుల అండతో బాబు రెచ్చిపోతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. కరోనా నేపథ్యంలోనూ ఎన్నికల ప్రక్రియను యజ్ఞంలా పూర్తిచేస్తే.. న్యాయస్థానం దీన్ని సీరియస్‌గా తీసుకోలేదన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోందనీ. ఎన్నికలు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల ప్రకారమే జరిగాయి. ఎన్నికలను ఆపాలని కోర్టుకెళ్లినవారి ఉద్దేశం ప్రజలకు తెలుసు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హయాం నుంచే ఈ దాగుడుమూతలు మొదలయ్యాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎన్నికలు వాయిదా వేశారు.. వద్దంటే ఎన్నికలన్నారు,. ప్రజా తీర్పును ఆపిన టీడీపీ నేతలకు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదు. ఇలాంటి కుయుక్తులతో తాత్కాలిక ఆనందం పొందుతారేమో కానీ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌వైపే జనం ఉంటారు. టీడీపీ, దాని వెనుక ఉన్న శక్తులు ఆయనను అడ్డుకోలేవు అని ఆదిమూలం పునరుద్ఘాటించారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎస్ఐ లతోపాటు వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

 

Tags: We will challenge the High Court judgment in the Division Bench .. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *