Natyam ad

పుంగనూరులో ఇండ్ల స్థలాలకు భూమిని సేకరిస్తాం-ఆర్‌డీవో శివయ్య

పుంగనూరు ముచ్చట్లు:

అర్హులైన పేదలందరికి ఇండ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు అవసరమైన భూమిని సేకరించే కార్యక్రమం త్వరలోనే పూర్తి చేస్తామని పలమనేరు ఆర్‌డీవో శివయ్య తెలిపారు. గురువారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి ఇండ్ల పట్టాలపై అధికారులు, వీఆర్‌వోలతో సమీక్ష నిర్వహించారు. స్థలాల కోసం కేటాయించిన భూమిని పరిశీలించారు. విలేకరులతో ఆర్‌డీవో మాట్లాడుతూ రాగానిపల్లె ప్రాంతంలో ఎంఐజి లేఔట్లకు భూమి ఇస్తామని రైతులు తెలిపారని , భూమిని పరిశీలించి కలెక్టర్‌కు నివేదికలు పంపుతామన్నారు. అలాగే జగనన్న కాలనీలకు అవసరమైన భూమిని పరిశీలించామని , సుమారు 11 ఎకరాలు అవసరం ఉందన్నారు. దీనిని పరిశీలిస్తామన్నారు. వార్డులు , గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలను సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ ప్రకాష్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: We will collect land for house sites in Punganur – RDO Sivaiah

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.