Natyam ad

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతాం- ఎస్పీ మణికంఠ

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం పట్టణంలో నామినేషన్ల కార్యక్రమాలను పరిశీలించారు. ఆర్‌వో కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే తెలుగుదేశం ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌ ఎక్కువసేపు ఆపివేయడంపై స్పందించి ్త ఎంబిటి రోడ్డులో స్వయంగా ఎస్పీ ట్రాఫిక్‌ను కొనసాగించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పుంగనూరులో ప్రత్యేక దళాలు పోలీంగ్‌కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోను శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనుమానితులు, రౌడీషీటర్లు, తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వారిని బైండోవర్‌ చేశామన్నారు. ఎన్నికలలో సామాన్యులు దైర్యంగా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తూ వారికి తగిన చేదోడు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఆర్‌వో నరసింహప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; We will conduct impartial elections- SP Manikantha

Post Midle