Date:25/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్లు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా చేపట్టేందుకు, పార్టీని పటిష్టం చేసేందుకు మండల స్థాయి కమిటిని ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుమతించారని తెలిపారు. ఈ మేరకు మండలంలో ఎంపీటీసీలుగా పార్టీ తరపున పోటీ చేసిన వారిని మెంబర్లుగాను, ఎంపీపీ అభ్యర్థి, జెడ్పిటిసిలను అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత సులభతరమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారాం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, ఆర్టీసిమజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, పార్టీ నాయకులు అమరనాథరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags; We will develop Punganur by all means- MLA Dwarakanathreddy