We will develop the Government Gazette in all ways

ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

– నాగభూషణం

Date:26/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. సోమవారం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిల ఆధ్వర్యంలో దసరా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణం పూజల్లో పాల్గొని , ఆసుపత్రిలోని వార్డులను, ఆసుపత్రి ఆవరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్‌తో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే ఏ వ్యక్తి బయట ఆసుపత్రులను ఆశ్రయించ కుండ ఉండేలా మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రిలో అవసరమైన సిబ్బంది క్వార్టర్స్, మంచినీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థులు, అమ్ము, అర్షద్‌అలి, శ్రీనివాసులు, నరసింహులు, అలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ అడ్మీషన్లకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు

Tags: We will develop the Government Gazette in all ways

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *