We will distribute pensions to all eligible poor

అర్హులైన పేదలందరికి పెన్షన్లు పంపిణీ చేస్తాం

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:27/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అర్హులైన పేదలందరికి పెన్షన్లు పంపిణీ చేస్తామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం రాత్రి ఆయన మున్సిపాలిటిలోని సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిలోని 31 వార్డులకు 672 పెన్షన్లు మంజూరైందన్నారు. వెహోత్తం 4,481మందికి పెన్షన్లను పంపిణీ చేస్తామన్నారు. ఇందు కోసం రూ.1.16 కోట్లు పంపిణీ చేసేందుకు నిధులు డ్రా చేయనున్నట్లు తెలిపారు. ఈ డబ్బును సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఆదేశించిన మేరకు పంపిణీ చేయాలన్నారు. అలాగే సచివాలయ కార్యదర్శులందరు కలసి తమ వార్డుల్లోని పెన్షన్‌దారుల జాబితాలను, వారి వివరాలను పరిశీలించి నివేదికలు సిద్దం చేసి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎవరి పెన్షను తొలగించలేదని, స్పష్టంగా లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ఆరోపణలకు తావులేకుండ అర్హులైన పేదలందరికి పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ , టీపీవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఇంటికి చేరిన ఎల్లమ్మ

Tags: We will distribute pensions to all eligible poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *