We will do all the work for the teachers

ఉపాధికూలీలందరికి పనులు కల్పిస్తాం

Date:26/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గ్రామీణ ఉపాధిహామి కూలీలందరికి పనులు కల్పిస్తామని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని కుమ్మరనత్తం గ్రామ సచివాలయంలో ఎంపీటీసీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఉపాధికూలీల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , జెడ్పిటిసి జ్ఞానప్రసన్న అత్యిధులుగా హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ తంబళ్లపల్లె శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో పనులు గుర్తించి, వలసలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కూలీలు అడిగిన చోట పని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, ఏపీవో శ్రీనివాసులు, జెఈ రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

సారా వ్యాపారులపై పీడి యాక్ట్ క్రింద కేసులు నమోదు

Tags:We will do all the work for the teachers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *