Natyam ad

పుంగనూరు మున్సిపాలిటిలో సమస్యలు లేకుండ చేస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు లేకుండా చేస్తామని మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌.పేటలోని హనుమంతురాయుదిన్నెలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న బావుట బుక్‌లెట్లను పంపిణీ చేసి , సంక్షేమ పథకాలు అందాయా లేదా అంటు విచారించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయాలకు కేటాయించిన రూ.20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు భారతి, అమ్ము, నరసింహులు, రేష్మా, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: We will do it without problems in Punganur Municipality

Post Midle

Leave A Reply

Your email address will not be published.