రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండ చేస్తాం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి.
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండ పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని ఎంసి.పల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ కార్యక్రమాలు ఎస్ఈ కృష్ణారెడ్డి, డీఈ విజయన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎంపీపీ, మంత్రి పెద్దిరెడ్డి ఏపీ చంద్రహాస్, యాదవ సంఘ జిల్లా కార్యదర్శి సుబ్రమణ్య యాదవ్ లు హాజరై భూమిపూజ పనులను చేశారు. అలాగే కుమ్మరనత్తం పంచాయతీ పిచ్చిగుండ్లపల్లె వద్ద ట్రాన్స్ పా ర్మర్ల మరమ్మతుల ఫ్యాక్టరీకి భూమిపూజ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ కర్నాటక సరిహద్దు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండ ఉండేందుకు మంత్రి 16 సబ్స్టేషన్లు మంజూరు చేశారని తెలిపారు. అలాగే ట్రాన్స్ పా ర్మర్ల మరమ్మత్తుకు చిత్తూరు, మదనపల్లెకు వెళ్లేవారని, ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేయడంతో రైతుల ట్రాన్స్ పా ర్మర్లు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి రైతుల ఇబ్బందులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఏడి రవికుమార్, ఏఈ ధనుంజయమూర్తి , కాంట్రాక్టర్ రవిశేఖర్‌రెడ్డి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరైయ్యారు.

Tags; We will do without electricity problems for farmers – MPP Bhaskar Reddy.
