We will finish the work today

నాడు నేడు పనులను పూర్తి చేస్తాం

– ఎంఈవో కేశవరెడ్డి

Date:25/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు నాడు నేడు పనులను అన్ని పాఠశాలల్లోను పూర్తి చేస్తామని ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని అడవినాథునికుంట ఆదర్శ పాఠశాల , ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు పాల్యెంపల్లె, నల్లగుట్లపల్లెతాండ, రాంపల్లెలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటిలో 8 పాఠశాలల్లోను, మండలంలో 23 పాఠశాలల్లోను నాడు నేడు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలల్లో 9 రకాల పనులను చేపట్టామన్నారు. వాటిలో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహారీతో పాటు విద్యుత్‌ పనులు, గ్రీన్‌బోర్డు, ఇం•ష్‌ల్యాబ్‌,గ్రంధాలయాల ఏర్పాటుతో పాటు చిన్నచిన్న మరమ్మతులు చేపట్టామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు జూన్‌ నెలలోపు పనులను పూర్తి నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ రీసోర్స్ పర్శన్లు శ్రీనివాసులు, ఆంజమ్మ, హెచ్‌ఎంలు యోజనగాంధి , మధుసూదన్‌రావు, శంకర్‌రెడ్డి, గంగరాజు, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లలో రంజాన్‌ ప్రార్థనలు

Tags: We will finish the work today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *