నిధులపై నిలదీస్తాం

Date:15/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ముఖ్యమైన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని వైసీపీ లోక్ సభపక్ష నేత మిధున్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామన్నారు. ముఖ్యంగా జీఎస్టీ పరిహారం పంపిణీపై చర్చకు పట్టుబట్టనున్నట్లు మిధున్ రెడ్డి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, కరోనా పరిస్థితులపై కూడా తాము చర్చకు పట్టుబడతామని మిధున్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మిధున్ రెడ్డి తెలిపారు.ఏపీకి ప్రత్యేక హోదా అంశం, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, నిర్వాసితులకు నష్టపరిహారం, జిఎస్టి పెండింగ్ బకాయిలు, గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చెప్పారని మిధున్ రెడ్డి అన్నారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని.. దీనికోసం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరతామని చెప్పారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరతామన్నారు. రఘురామకృష్ణంరాజుపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలని.. పిటిషన్ పై వేగంగా చర్య తీసుకోవాలని కోరతామన్నారు. అయితే, ఆయనను తాము సస్పెండ్ చేయమని.. వైయస్సార్ కాంగ్రెస్.. ఎంపీ రఘురామరాజుకు పూర్తి గౌరవం ఇచ్చిందని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.

చంద్రబాబు పై రోజా మండిపాటు

Tags:We will focus on funding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *