పుంగనూరు మున్సిపాలిటిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తాం – చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శుక్రవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలోని మహిళలతో మాట్లాడి పథకాల ఆమలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తెలిపిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. తక్షణమే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో పార్టీకతీతంగా సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి గడపకు కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు వెళ్లి సమస్యలను గుర్తించి నివేదికలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నివేదికలను మంత్రి పెద్దిరెడ్డికి సమర్పించి, తొలి ప్రాధాన్యత క్రింద పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, కౌన్సిలర్లు త్యాగరాజు, అమ్ము, నరసింహులు, మమత, జేపి.యాదవ్‌, రేష్మాతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: We will identify and solve the problems in Punganur Municipality – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.