Natyam ad

పుంగనూరు గడపగడపలో సమస్యలు గుర్తిస్తాం-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబంలో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మేలుపట్లలో ప్రారంభించారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ వెంకటరెడ్డియాదవ్‌, మంత్రి పీఏ చంద్రహాస్‌తో కలసి చైర్మన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అందాయా లేదా అంటు ఆరా తీశారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటా ఉన్న వ్యక్తి గత సమస్యలను గుర్తించి నివేదికలు సిద్దం చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడపగడకు వస్తున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సచివాలయాలకు మంజూరైన రూ.20 లక్షలతో ప్రజలకు అవసరమైన పనులను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు కమలమ్మ, జయభారతి, అమ్ము, కిజర్‌ఖాన్‌, నరసింహులు,కాళిదాసు, జెపి.యాదవ్‌, రేష్మా,సాజిదా, ఆదిలక్ష్మీ, మమత, యువకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: We will identify problems step by step – Chairman Aleembasha

Post Midle