దేవాలయాల ఆదాయాన్ని పెంచుతాం

విజయనగరంముచ్చట్లు:

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు రామతీర్ధం క్షేత్రాన్ని సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ దేవాలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అన్యక్రాంతం అవుతున్న దేవాదాయశాఖ భూములను కాపాడుకునే దిశగా జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. దేవాలయాలకు సంబందించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటాం. అనేక భూములు చంద్రబాబు దారాదత్తం చేశారు. ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ కు చర్యలు చేపడుతున్నాం. 40 వేల సీసీ కెమారాలను ఆలయాల వద్ద అమర్చడం జరిగింది. విమర్శలకు తావివ్వకుండా టెంపుల్ వద్ద భద్రతపెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలభై టెంపుళ్లను చంద్రబాబు కూలిస్తే… జగన్ గారు పునఃనిర్మాణం చేసేందుకు పూనుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:We will increase the revenue of temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *