విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం. కర్నూలు జిల్లా ఎస్పీ  జి. కృష్ణ కాంత్ ఐపియస్

కర్నూలు  ముచ్చట్లు:

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమానికి 54 ఫిర్యాదులు . ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీజి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 54 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.ఎమ్మిగనూరు కు చెందిన మహేష్ అనే వ్యక్తి ఎయిర్ టెల్, డిటిహెచ్ నెట్ వర్క్ ల గురించి నేర్పించి, డీలర్ షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ. 10 లక్షలు తీసుకొని తప్పించుకుని తిరుగుతూ మోసం చేస్తున్నాడని ఎమ్మిగనూరు కు చెందిన బి. రమేష్ ఫిర్యాదు చేశారు. నా భర్త , వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఆమె కు నా పుట్టింటి నగలు తీసుకువెళ్ళి ఇచ్చి నన్ను, నా కుమార్తె కు అన్యాయం చేస్తున్నాడని, ఇంట్లోకి రానివ్వకుండా విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని హాలహార్వీ మండలం, గుళ్యం గ్రామానికి చెందిన చాంద్ బీ ఫిర్యాదు చేశారు. కంటి చూపు సరిగా లేదు, కాళ్ళనొప్పులున్న నన్ను నా కోడుకు, కోడలు నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారని దేవనకొండకు చెందిన అల్లెమ్మ ఫిర్యాదు చేశారు. మా కుమారుడు శివ శంకర్ రెడ్డి తాగుడు కు అలవాటు పడి దుర్బషలాడుతూ మా అన్న, వదిన, మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని కోడుమూరు మండలం, ప్యాలకుర్తి కి చెందిన విజయభాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నేను మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాను. పెద్దల నుండి వచ్చిన ఇల్లు నా అనభువంలో ఉన్నది. నా రిటైర్ బెనిఫిట్స్ ను, ఇంటిని స్వాధీనం చేసుకుంటామని 3 నెలల నుండి కొందరు వ్యక్తులు బాండ్ల పై సంతకాలు చేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆదోని, ఎమ్ ఐజి కాలనీ కి చెందిన కె. పుష్పా ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో డిఎస్పీ జె. బాబు ప్రసాద్ , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు , సిఐ శివశంకర్ పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయం .

 

 

 

 

 

Tags:We will investigate and do legal justice. Kurnool District SP G. Krishna Kant IPS

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *