Natyam ad

ప్రజా సమస్యలపై కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం-సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

కరీంనగర్ ముచ్చట్లు:

ప్రపంచ శ్రామిక వర్గ విముక్తి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై రాజీలేని నికరమైన పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు.శనివారం రోజున ముకుందలాల్ మిశ్రా భవన్లో కామ్రేడ్ లెనిన్ 99వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లెనిన్ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం అంటే అది ఒక బాధ్యతని,విప్లవ కార్యాచరణను అర్థం చేసుకోవడం,మారుతున్న ప్రతి పరిస్థితికి ప్రతి మలుపుకు మార్క్సిజాన్ని అన్వయించాడని, అలాంటి ఆలోచనతోనే ఆచరణలో కూడా ఉన్నారని అందుకే శ్రామిక వర్గం విముక్తి కోసం పనిచేసే ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త లెనిన్ జీవితాన్ని అధ్యయనం చేయాలని, అధ్యయనాన్ని ,కార్యాచరణ ను అన్వయింపు చేసుకొని ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రతి విషయాన్ని లెనిన్ తన జీవితకాలంలో సునిశితంగా పరిశీలించి పరిశోధించేవారున్నారు. రష్యా విప్లవం జయప్రదం కావడానికి తన మేధో సంపత్తిని అధ్యయనాన్ని జోడించి విజయవంతం చేశారని గుర్తు చేశారు.

 

 

ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ప్రజా పోరాటంలో లెనిన్ కనిపిస్తున్నాడని,వినిపిస్తున్నాడని, జీవిస్తున్నాడన్నారు. లెనిన్ లాగే మానవత్వం ఉన్న మనుషులుగా అంతరాల్లేని దోపిడీ లేని నవ సమాజం నిర్మించే కృషిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ శ్రామిక వర్గానికి గొప్ప దార్శనీకునిగా,స్ఫూర్తిదాతగా ఎప్పుడూ ఉంటారని అన్నారు. లెనిన్ జీవితమంటే ప్రజల జీవితమని కార్మిక వర్గ శ్రామిక వర్గ విముక్తి కోసం పనిచేసినప్పుడే కామ్రేడ్ లెనిన్ కు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందన్నారు. కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో జిల్లాలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని తాడిత, పీడిత ప్రజానీకానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడి కందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్, నాయకులు శ్రీకాంత్,అరవింద్, జగదీష్,మల్లారెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:We will move with the spirit of Comrade Lenin on public issues – CPM District Secretary Vasudeva Reddy

Post Midle