పుంగనూరు జాతరను పకడ్భంధిగా నిర్వహిస్తాం – డిఎస్పీ సుధాకర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఈనెల 14, 15 న జరగనున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పకడ్భంధిగా నిర్వహిస్తామని పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, సీఐ మధుసూదన్‌రెడ్డితో కలసి ప్యాలెస్‌ను పరిశీలించారు. ప్యాలెస్ పురాతన భవనం కావడంతో ముందుజాగ్రత్తగా అక్కడ ర ద్దీని నియంత్రిస్తామన్నారు. అలాగే తొక్కిసలాట జరగకుండ బ్యారీకేడ్లు , షామియానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే భద్రత , ట్రాఫిక్ క్రమబద్దీకరణ, దొంగతనాలు జరగకుండ ఉండేందుకు అధిక సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు కేటాయిస్తున్నామన్నారు. మఫ్టిలో పోలీసులను ఉంచుతామన్నారు. ప్రజలందరు ఐకమత్యంతో జాతరను జరుపుకోవాలని డిఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణకుమార్, ఎస్‌ఐ మోహన్‌కుమార్ పాల్గొన్నారు.

Tags; We will organize the Punganur Jatara in full swing – DSP Sudhakar Reddy
