Natyam ad

మైదానాన్నీ ‘దున్నేస్తాం’…..రైతన్న క్రికెట్…..

ఆదిలాబాద్ ముచ్చట్లు:
 
పంట పొలాన్నే కాదు.. క్రికెట్ మైదానాన్నీ ‘దున్నేయగలమని నిరూపిం చారు ఈ రైతులు.. వ్యవసాయం చేయడమే కాదు.. అయిదు పదుల వయసులో.. యువతతో పోటీ పడుతూ క్రికెట్ కూడా ఆడతామంటూ బ్యాట్, బంతి చేతబట్టారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతులు. సంక్రాంతి సందర్భంగా బోథ్ లోని లాలిచ్ మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. పక్కనే పొలం పనుల కోసం వచ్చిన రైతులు కొందరు ఇది చూడ్డానికి వచ్చారు. అక్కడున్న టీచరు ఒకరు ‘మీరూ ఆడతారా?’ అని అడగ్గా వారంతా సై అన్నారు. అప్పటికప్పుడు టీమ్ ఏర్పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్వాహకుల జట్టు 8 ఓవర్లలో 59 పరుగులు చేయగా, ఆ తర్వాత అన్న దాతల జట్టు 54 పరుగులు చేసి 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు. ఆట జరుగుతున్నంతసేపూ.. పంచె కట్టులో ఉన్న రైతులు మైదానంలో చురుగ్గా పరుగులు తీస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభా గాల్లో రాణించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: We will ‘plow’ the ground ….. Raitanna Cricket ..