గ్రామీణ క్రీడలు ప్రోత్సహిస్తాం – ఎంపిపి భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ క్రీడలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని ఏతూరు గ్రామంలో నియోజకవర్గ స్థాయి ఐదు రోజులు జరిగే క్రీకెట్ పోటీలను ఎంపిపి , ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, సీఐ గంగిరెడ్డితో కలసి ప్రారంభించారు. ఎంపిపి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీకెట్ ఆడారు. ఎంపిపి మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులు, ఎంపి మిధున్ యువసేన సంయుక్తంగా నాల్గవ ఏటా నిర్వహించే పోటీలలో ప్రతి ఒక్కరు క్రీడాస్పూర్తితో పాల్గొనాలని కోరారు. అలాగే ఈ ప్రాంతంలో మైదానం నిర్మించాలని నిర్వాహకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కోరారు. ఈ విషయాన్ని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎంపిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 టీముల క్రీడాకారులతో పాటు వైఎస్సార్‌సిపి నాయకులు జయరామిరెడ్డి, ప్రభాకర్‌నాయక్, సుబ్రమణ్యం, చంద్రారెడ్డి యాదవ్, ప్రశాంత్, మహేష్, మంజు, శ్రావణ్, శివకుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags;We will promote rural sports – MP Bhaskar Reddy