హనుమాన్ ఆలయ స్థలాలను పరిరక్షిస్తాం

మేడ్చల్ ముచ్చట్లు:

ప్రజాక్షేత్రంలో పనిచేసేవారికి ప్రజా సంక్షేమం ముఖ్యం కానీ వ్యక్తి చేసే విమర్శలకు తాను ప్రాధాన్యం ఇవ్వబోనని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.  మంగళవారం అల్వాల్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న వందల ఏళ్ళ నాటి హనుమాన్ మందిర్ స్థల కబ్జా చేస్తున్నారు అని తెలుసుకున్న ఆయన ఈ ఆలయాన్ని దర్శించుకుని అక్కడి పరిస్థితులపై నిర్వాహకుడు మామిడి జనార్దన్ రెడ్డి,  స్థానికులతో  మాట్లాడారు. ఆలయం కంటోన్మెంట్ పరిధిలో ఉన్నప్పటికీ భక్తులంతా అల్వాల్  వాళ్ళు ఉన్నందువల్ల ఆలయ పరిసరాల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను పిలిచి ఇక్కడ జరుగుతున్న విషయాలను, ఆలయ చరిత్రను ఆయనకు తెలియపరిచారు.  ఒకప్పుడు ఆలయం పక్క నుంచి ప్రధాన రహదారి ఉండగా ఆర్మీ అధికారులు ఈ రహదారిని మూసివేశారు.

 

 

ఈ క్రమంలోనే  ఆలయ పక్క స్థలం వారు లే అవుట్ చేస్తూ ఆలయానికి ఎలాంటి హాని కలిగించకుండా చూస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.  ఇప్పుడు కంటోన్మెoట్ అధికారులను అడ్డం పెట్టుకుని ఆలయాన్ని ని అష్ట దిగ్బంధనం చేశారు. ఈ చర్యలను ఆయన తప్పు పట్టారు. ఆలయానికి అవసరమైన రోడ్డు ను ఆక్రమించి అది ప్రహరీ నిర్మాణం చేసి ఇప్పుడు దాన్ని  ఎవరు కూల్చి వేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న కంటోన్మెంట్ సీఈఓ పై ఆయన మండిపడ్డారు. వారం రోజుల గడువులో తనంతతానుగా ఆలయానికి రహదారి ఇస్తే సరి లేదంటే స్వయంగా తానే కూల్చివేస్తామని ఎన్ని కేసులు పెట్టినా తాను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సైతం తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

 

Post Midle

Tags: We will protect the Hanuman temple sites

Post Midle
Natyam ad